Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

తిరుపతి జిల్లా యూత్ సెల్ చైర్మన్‌గా అందే వెంకటేష్ ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తిరుపతి జిల్లా యూత్ సెల్ చైర్మన్‌గా అందే వెంకటేష్ ఎంపిక

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్‌ఆర్‌పీసీఐ) తిరుపతి జిల్లా యూత్ సెల్ చైర్మన్‌గా మంగంపేట అగ్రహారం గ్రామానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అందే వెంకటేష్ నియమితులయ్యారు. ఆయనకు ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

-సేవకు దక్కిన గుర్తింపు.

గత కొంతకాలంగా స్థానికంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో వెంకటేష్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా యువతలో సామాజిక చైతన్యం తీసుకురావడానికి ఆయన చేసిన విశేష కృషిని, సేవా దృక్పథాన్ని, అంకితభావాన్ని గుర్తించిన సంస్థ జాతీయ అధిష్టానం ఆయనకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

-బాధ్యత మరింత పెరిగింది..

జిల్లా యూత్ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా అందే వెంకటేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంస్థకు మరియు HRPCI స్టేట్ చైర్మన్ తాలూరి ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పదవి రావడం వల్ల తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా సంస్థను బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, యువత సంక్షేమం, సామాజిక న్యాయం కోసం మరింత నిబద్ధతతో అహర్నిశలు శ్రమిస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు

-అభినందనల వెల్లువ..

తమ గ్రామానికి చెందిన వెంకటేష్‌కు జిల్లా స్థాయి పదవి దక్కడం పట్ల మంగంపేట గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజా సేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తిరుపతి జిల్లా యూత్ సెల్ చైర్మన్‌గా అందే వెంకటేష్ ఎంపిక

తిరుపతి జిల్లా యూత్ సెల్ చైర్మన్‌గా అందే వెంకటేష్ ఎంపిక

తిరుపతి జిల్లా యూత్ సెల్ చైర్మన్‌గా అందే వెంకటేష్ ఎంపిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *