Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తల్లిదండ్రుల కమిటీ పునర్వ్యవస్థీకరణ మరియు ఎన్నికల ప్రకటన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలోని అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ పునర్వ్యవస్థీకరణ సంబంధించి 15-09-2026 తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు.
  • ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 15వ తేదీన పునర్నియామకానికి నోటిఫికేషన్ విడుదల,18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు ఎన్నికల ఓటర్ల జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శించడం,18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు మరియు సవరణలు స్వీకరించడం మరియు పరిశీలించడం,25వ తేదీ…

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరిధిలోని అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ పునర్వ్యవస్థీకరణ సంబంధించి 15-09-2026 తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 15వ తేదీన
పునర్నియామకానికి నోటిఫికేషన్ విడుదల,18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు ఎన్నికల ఓటర్ల జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శించడం,18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు మరియు సవరణలు స్వీకరించడం మరియు పరిశీలించడం,25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు తుది ఓటర్ల జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శించడం,29వ తేదీ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పాఠశాల యజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలు,29వ తేదీ మధ్యాహ్నం 1:30 కు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక,29వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం,29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 వరకు పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క మొదటి సమావేశం నిర్వహించవలసి ఉంటుందని తాళ్ళరేవు మండల విద్యాశాఖ అధికారులు ఏ మంగాయమ్మ,ఎం ఉమ తెలియజేశారు.ఎన్నికల ప్రక్రియలో సంబంధిత నిబంధనలు మరియు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఓటర్ల జాబితా ప్రదర్శన, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రకటన తదితర కార్యక్రమాలను నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *