Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

తక్షణ ఆర్థిక సాయంతో మానవత్వాన్ని చాటుతున్న గడ్డం కుటుంబం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తక్షణ ఆర్థిక సాయంతో మానవత్వాన్ని చాటుతున్న గడ్డం కుటుంబం

స్వర్గీయ గడ్డం విజయభాస్కర్ రెడ్డి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్న గడ్డం శ్రీనివాసులు రెడ్డి

ఆత్మకూరు, జూలై 14(హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బద్దల కొండమ్మ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబానికి గడ్డం కుటుంబం రూ.5,000 తక్షణ ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఈ సహాయం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.జంగాలపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ గడ్డం విజయభాస్కర్ రెడ్డి గత నాలుగేళ్లుగా నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబ సభ్యులు మృతి చెందినప్పుడు, వారి అంత్యక్రియల నిర్వహణకు తమ వంతు సహాయంగా రూ.5,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తూ సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా అవసరంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం ద్వారా ఆయన గ్రామ ప్రజల మన్ననలు పొందారు.

ఇటీవల గడ్డం విజయభాస్కర్ రెడ్డి అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో ఆయన ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం నిలిచిపోకుండా ఉండాలనే సంకల్పంతో ఆయన సోదరుడు గడ్డం శ్రీనివాసులు రెడ్డి ముందుకు వచ్చారు. తన సోదరుడి సేవా భావాన్ని కొనసాగిస్తూ, పేద కుటుంబాలకు అదే విధంగా తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

బద్దల కొండమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే గడ్డం శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, కష్టసమయంలో సమాజం అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు, జంగాలపల్లి ఎస్సీ కాలనీ గ్రామస్తులు మాట్లాడుతూ, ఆపద సమయంలో తమకు తక్షణ ఆర్థిక సహాయం అందించిన గడ్డం శ్రీనివాసులు రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ గడ్డం విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించిన సేవా కార్యక్రమాన్ని ఆయన సోదరుడు అదే నిబద్ధతతో కొనసాగించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో షేక్ సుబహాన్, దేవరపాటి మాల్యాద్రి, నిమ్మకాయల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామ పెద్దలు కూడా గడ్డం కుటుంబం చేపడుతున్న సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *