Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

డోర్నకల్ నియోజకవర్గం నా అడ్డా …నేనే పోటీ చేస్తా✊ నేనే గెలుస్తా ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నేడు_08_09_2026చిన్నగూడూర్:

నేడు_08_09_2026చిన్నగూడూర్:

చిన్న గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నిరసనవచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. డోర్నకల్ నియోజకవర్గం నా అడ్డా.. నేనే పోటీ చేస్తా.. గెలుస్తా.. : మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే పనులు చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలందరికీ సమన్యాయం చేయాల్సిన అధికారులు పక్షపాత ధోరణి వీడాలని సూచించారు.”వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. డోర్నకల్ నియోజకవర్గం నా అడ్డా.. నేనే పోటీ చేస్తా.. గెలుస్తా.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిని అవుతా.. మీరు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదు” అంటూ రెడ్యానాయక్ గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో డోర్నకల్ యువనేత డీఎస్ రవిచంద్ర గారు మరియు పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *