Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 5లో రాత్రికి రాత్రే చెట్ల తొలగింపు?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 5లో రాత్రికి రాత్రే చెట్ల తొలగింపు?

వార్త ముఖ్యాంశాలు

  • చెట్లు కొట్టాలి..
  • షెడ్డు కట్టాలి..!
  • హయత్‌నగర్‌లో ఇదే తంతా?

చెట్లు కొట్టాలి.. షెడ్డు కట్టాలి..!

హయత్‌నగర్‌లో ఇదే తంతా?

డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 5లో రాత్రికి రాత్రే చెట్ల తొలగింపు?
టౌన్‌ప్లానింగ్‌, మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ప్రశ్నలు

హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 10:
హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో చెట్ల తొలగింపు, అనంతరం షెడ్ల నిర్మాణంపై స్థానికుల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 5లో ఓ షెడ్డు సమీపంలోని చెట్లు అకస్మాత్తుగా తొలగించడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిన్న కనిపించిన చెట్లు.. నేడు మాయం!
స్థానికుల కథనం ప్రకారం.. నిన్న ఉదయం వరకు రోడ్డుపక్కన చెట్లు కనిపించగా, ఈరోజు ఉదయం చూసేసరికి అవి కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెబుతున్నారు. రాత్రికి రాత్రే చెట్లను తొలగించారా? ఒకవేళ తొలగించి ఉంటే ఎవరి అనుమతితో తొలగించారు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.

షెడ్డు నిర్మాణానికి చెట్లు అడ్డుగా ఉన్నాయనే కారణంతో వాటిని తొలగించారా? లేక మరేదైనా కారణం ఉందా? చెట్ల తొలగింపునకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నారా? అనే విషయాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారుల నిఘా ఎక్కడ?

హయత్‌నగర్‌ సర్కిల్‌లో నిర్మాణాలు, షెడ్ల ఏర్పాటు, చెట్ల తొలగింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెట్ల తొలగింపునకు అనుమతులు అవసరమైతే అవి పొందారా? షెడ్డు నిర్మాణానికి అనుమతి ఉందా? నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా? అనే అంశాలను పరిశీలించాలని కోరుతున్నారు.

ఒకవైపు పచ్చదనాన్ని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపడుతుండగా.. మరోవైపు అనుమతులపై స్పష్టత లేని విధంగా చెట్లు తొలగించబడుతున్నాయనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.

విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి!

డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 5లో జరిగినట్లు చెబుతున్న చెట్ల తొలగింపు ఘటనపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. చెట్ల తొలగింపునకు, షెడ్డు నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటించారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని వారు అంటున్నారు.

అనుమతులు లేకుండా చెట్లను తొలగించినట్లు లేదా నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణలో తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే చెట్ల తొలగింపు, షెడ్డు నిర్మాణానికి సంబంధించిన పూర్తి వాస్తవాలు అధికారుల పరిశీలన అనంతరం మాత్రమే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *