వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 27(పున్నమి న్యూస్ ప్రతినిధి )స్థానిక పామూరు పట్టణంలోని పోలీస్స్టేషన్ లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా నివాళులు అర్పిస్తూ,భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.దేశ రక్షణ, సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ఎన్నటికీ మరువలేమని పామూరు ఎస్.
- ఐ.
- కట్టా అనూక్ తెలిపారు..పోలీస్ అమర వీరుల సంస్మరణదినోత్సవం పురస్కరించుకొని స్థానిక పామూరు పట్టణ పోలీస్స్టేషన్ లో తన సిబ్బందితో కలిసి, భారీ ర్యాలీగా బయలుదేరి,అక్కడ స్థానిక మమ్మి, డాడీ సెంటర్లో శాంతి, భద్రతలు దేశానికి రెండు కళ్ళలాంటివని,,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఎంతో ఉందని ఉపన్యసించారు.
పామూరు, అక్టోబర్ 27(పున్నమి న్యూస్ ప్రతినిధి )స్థానిక పామూరు పట్టణంలోని పోలీస్స్టేషన్ లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా నివాళులు అర్పిస్తూ,భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.దేశ రక్షణ, సమాజంలో శాంతి, భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ఎన్నటికీ మరువలేమని పామూరు ఎస్. ఐ. కట్టా అనూక్ తెలిపారు..పోలీస్ అమర వీరుల సంస్మరణదినోత్సవం పురస్కరించుకొని స్థానిక పామూరు పట్టణ పోలీస్స్టేషన్ లో తన సిబ్బందితో కలిసి, భారీ ర్యాలీగా బయలుదేరి,అక్కడ స్థానిక మమ్మి, డాడీ సెంటర్లో శాంతి, భద్రతలు దేశానికి రెండు కళ్ళలాంటివని,,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఎంతో ఉందని ఉపన్యసించారు. ప్రజలప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా కాపాడటంలో పోలీస్వ్యవస్థ పాత్ర చాలా కీలకమని చెప్పారు..ఇలాంటి శాంతి, భద్రతలు కాపాడేదిశలో ఎంతోమంది పోలీసులు అమరవీరులయ్యారని కొనియాడారు.. ఇలాంటి పోలీస్ సంస్మరణ దినోత్సవం ప్రతి సంవత్చరం విధిగా జరుపుకోవాలని కోరారు