Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

టెట్ లో మార్పులు చేస్తూ సిలబస్ బోధన అనుగుణంగా ఇన్ సర్వీస్ టెట్ నిర్వహించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టెట్ లో మార్పులు చేస్తూ సిలబస్ బోధన అనుగుణంగా ఇన్ సర్వీస్ టెట్ నిర్వహించాలి

TG TET-2లో ఏపీ తరహా సిలబస్ అమలు చేయాలి – విజ్ఞప్తి*

*పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా::13/07/2026*

భాషోపాధ్యాయుల సమస్యలపై విద్యాశాఖకు RUPP-TS వినతిపత్రం
హైదరాబాద్ (జూలై 13): తెలంగాణలో నిర్వహించే టీజీ టెట్ (TG TET) పేపర్–2లో ఆంధ్రప్రదేశ్ తరహాలోనే సబ్జెక్టు వారీగా సిలబస్‌ను అమలు చేసి, కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్–తెలంగాణ డిమాండ్ చేసింది.
ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు **శానమోని నర్సిములు** ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం విద్యాశాఖ సంచాలకులు శ్రీ నవీన్ నికోలస్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ రమేష్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలోని ముఖ్యమైన డిమాండ్లు ఇవే:
*టెట్ సిలబస్ మార్పు:* పేపర్–2లో ఏపీ తరహాలో సబ్జెక్టు వారీ సిలబస్ అమలు చేయాలి.
*డిప్యూటేషన్ నిబంధనల సవరణ:** DIET, IASE సంస్థల్లో ఖాళీ పోస్టులను ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులతో భర్తీ చేయడానికి ‘ఐదేళ్ల స్కూల్ అసిస్టెంట్ అనుభవం’ అనే నిబంధనను సవరించాలి. గతంలో పనిచేసిన భాషా పండితుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
*టెట్ ఉత్తీర్ణత మార్కులు:** ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్‌లో **35 శాతం** ఉత్తీర్ణత మార్కులు నిర్ణయిస్తూ జీవో జారీ చేయాలి.
*పోస్టుల అప్‌గ్రేడేషన్:** రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మిగిలి ఉన్న భాషా పండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి.
* త్రిభాషా సూత్రం:** ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా సూత్రం ప్రకారం భాషా పండితులను నియమించాలి.
* జీవో–25 సవరణ:** రేషనలైజేషన్ జీవో–25ను సవరించి తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషోపాధ్యాయుల పోస్టులను ఇతర సబ్జెక్టులతో సమానంగా ఉన్నత పాఠశాలలకు మంజూరు చేయాలి.
*వర్క్‌బుక్స్ పంపిణీ:** 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు భాషలకు సంబంధించిన వర్క్‌బుక్స్ అందుబాటులోకి తీసుకురావాలి. అధికారుల సానుకూల స్పందన
వినతిపత్రంలోని అంశాలపై విద్యాశాఖ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిరాజు శశికుమార్, నల్గొండ జిల్లా అధ్యక్షులు గాదె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

టెట్ లో మార్పులు చేస్తూ సిలబస్ బోధన అనుగుణంగా ఇన్ సర్వీస్ టెట్ నిర్వహించాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *