టీలో అర చెంచా చక్కెర… కూల్‌డ్రింక్‌లో ఏకంగా 6 చెంచాలా?
మధుమేహం ఉన్నవారు టీలో, కాఫీలో చక్కెర తగ్గించాలని వైద్యులు చెబుతుంటే, కొందరు మాత్రం బయటకు వెళ్లి చిన్న కూల్‌డ్రింక్ బాటిల్‌ను గటగటా తాగేస్తారు. ఇదేం లెక్కండీ బాబూ!
చిన్నపిల్లలు తాగే 200 మి.లీ. బాటిల్‌లో ఉండే చక్కెర ఎంతో తెలుసా?
థమ్స్ అప్: 20.8 గ్రాములు — సుమారు 5 టీ స్పూన్లు
స్ప్రైట్: 23.4 గ్రాములు — సుమారు 6 టీ స్పూన్లు
క్యాంపా కోలా: 21–22 గ్రాములు — సుమారు 5–5½ టీ స్పూన్లు
మాజా: 29.8 గ్రాములు — సుమారు 7½ టీ స్పూన్లు
ఒక టీ స్పూన్ చక్కెరలో సుమారు 4 గ్రాములు ఉంటాయి.
అంటే టీలో చక్కెర తగ్గించి, కూల్‌డ్రింక్‌తో పంచదార విందు చేసుకున్నట్టే కదా!
ఈ పానీయాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను వేగంగా పెంచవచ్చు. తరచుగా కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల బరువు పెరగడం, మధుమేహ నియంత్రణ దెబ్బతినడం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.
దాహం వేస్తే చల్లని నీరు, చక్కెర కలపని మజ్జిగ లేదా నిమ్మకాయ నీటిని ఎంచుకోండి.
కూల్‌డ్రింక్ బాటిల్ చిన్నదే కావచ్చు… కానీ అందులోని చక్కెర ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి!
మధుమేహం ఉన్నవారే కాదు, పిల్లలు, యువత, పెద్దలు — ప్రతి ఒక్కరూ చక్కెర పానీయాలను తగ్గించండి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. ఇంట్లోనూ, బయటా ఆరోగ్యకరమైన పానీయాలనే ఎంచుకోండి.
కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండండి… ఆరోగ్యానికి చేరువగా ఉండండి!
డాక్టర్ ఎం.వి.రమణయ్య
