Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి…. చిట్వేల్‌లో రైతు సంఘం నాయకుల నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి…. చిట్వేల్‌లో రైతు సంఘం నాయకుల నిరసన

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా చిట్వేల్‌లో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నిరసన తెలిపారు.
  • 13.80 కోట్ల ఓట్ల తొలగింపునకు కారణమయ్యారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు ఓబిలి పెంచలయ్య డిమాండ్ చేశారు.
  • ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదని అన్నారు.

తిరుపతి జిల్లా చిట్వేల్‌లో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నిరసన తెలిపారు. 13.80 కోట్ల ఓట్ల తొలగింపునకు కారణమయ్యారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు ఓబిలి పెంచలయ్య డిమాండ్ చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదని అన్నారు. పాత రికార్డులు, ఆధారాలు సమర్పించాలనే నిబంధనలు యువత ఓటు హక్కు పొందేందుకు ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లోనుకాకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రపతి జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కటారి శంకరయ్య, నాయకులు నాగయ్య, సుబ్బరాయుడు, చలపతి రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *