వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి, ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణం లోని జ్ఞానప్రద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహో త్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
- ఉదయం 10 గంటల 13 నిమిషాలకు శుభముహూర్తంలో శ్రీ వేంకటే శ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య టాటా నరసింహరావు, కులస చివులు ఆచార్య ఎం.
- భూపతి నాయుడు చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన సందర్భంగా ఉపకులపతి ఆచార్య టాటా నరసింహరావు , కులసచివులు ఆచార్య ఎం.
తిరుపతి, ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణం లోని జ్ఞానప్రద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహో త్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 గంటల 13 నిమిషాలకు శుభముహూర్తంలో శ్రీ వేంకటే శ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య టాటా నరసింహరావు, కులస చివులు ఆచార్య ఎం. భూపతి నాయుడు చేతుల మీదుగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన సందర్భంగా ఉపకులపతి ఆచార్య టాటా నరసింహరావు , కులసచివులు ఆచార్య ఎం. భూపతి నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారికి నవరత్నాలు, బంగారు కాసులను, వెండి కాసులను, ఇతర కానుకలు సమర్పించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన అనంతరం భక్తులు ప్రథమ దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చినరాయుడు , ఆలయ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ నరసింహ , కేఎం భాను , టీ. తాండవ కృష్ణ , నెల్లూరు సుబ్రహ్మణ్యం , సిరిగిరి రమేష్ బాబు , నరసింహన్ , బి. శ్రీనివాసులు , టీవీఎస్ లక్ష్మీనారాయణ, నీలం నరేంద్రనాథ్ ,గుండాల గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.అలాగే మాజీ ఉపకులపతులు ప్రొఫెసర్ కె. రాజారెడ్డి , వి. శ్రీకాంత్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరిచరణ్ , కౌశిక్ , వినయ్ , తదితరులు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు.