Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

జి.మామిడాడలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జి.మామిడాడలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

జి.మామిడాడ, అక్టోబరు 24 (పున్నమి ప్రతినిధి): పెదపూడి మండలం జి.మామిడాడలోని పాటిమీద ప్రాంతంలో శనివారం కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త రావాడ నాగు, గొల్లల మామిడాడ ఎంపీటీసీ 5వ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాపర్తి శ్రీనివాసు స్థానికులను కలిసి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జుత్తుక సూర్యకుమారి, గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది.

జి.మామిడాడలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

జి.మామిడాడలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

జి.మామిడాడలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *