వార్త ముఖ్యాంశాలు
- పల్నాడు : నరసరావుపేట, తేది 5.10.26 జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్-2026 లో సంయుక్త కలెక్టర్ సంజనా శ్రీహర్ష ,జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పాల్గొన్నారు.
- రెవెన్యూ అధికారుల సమావేశంలో పట్టాదారు పాసు పుస్తకాలు వెరిఫికేషన్ ఏ మేరకు జరుగుతున్నది , రీ సర్వే ఫిఫ్త్ ఫేస్ విలేజెస్లో ఎలా జరుగుతున్నది, పిజిఆర్ఎస్లో వచ్చిన సర్వే సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది, మీసేవ , ఏపీ సేవ లాగిన్, హౌస్ సైట్ పట్టాలపై వెరిఫికేషన్,…
- వాటికి కౌంటర్ దాఖలు చేసినది ఎన్ని , ఇంకా ఎన్నింటికి దాఖలు చేయవలసి ఉన్నది, డేటెడ్ ల్యాండ్స్, 22 A, వాటర్ బాడీస్ తదితర అంశాలపై ఆర్డీవోలు, తాసిల్దారు లతో కలెక్టర్ సమీక్షించారు.
పల్నాడు : నరసరావుపేట, తేది 5.10.26 జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్-2026 లో సంయుక్త కలెక్టర్ సంజనా శ్రీహర్ష ,జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారుల సమావేశంలో పట్టాదారు పాసు పుస్తకాలు వెరిఫికేషన్ ఏ మేరకు జరుగుతున్నది , రీ సర్వే ఫిఫ్త్ ఫేస్ విలేజెస్లో ఎలా జరుగుతున్నది, పిజిఆర్ఎస్లో వచ్చిన సర్వే సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది, మీసేవ , ఏపీ సేవ లాగిన్, హౌస్ సైట్ పట్టాలపై వెరిఫికేషన్, ఫ్లాట్స్ మ్యాపింగ్, హైకోర్టులో కంటెంట్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? వాటికి కౌంటర్ దాఖలు చేసినది ఎన్ని , ఇంకా ఎన్నింటికి దాఖలు చేయవలసి ఉన్నది, డేటెడ్ ల్యాండ్స్, 22 A, వాటర్ బాడీస్ తదితర అంశాలపై ఆర్డీవోలు, తాసిల్దారు లతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వివిధ మండలాల్లో రీ సర్వేపై చేపడుతున్న ఫీల్డ్ స్థాయి పనులు, పెండింగ్లో ఉన్న అంశాలు, లక్ష్యాల సాధన పై అధికారులతో చర్చించారు. రీ సర్వే పనులను నిర్దేశిత మార్గదర్శలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని తాసిల్దారులను ఆదేశించారు. సర్వే పై పిజిఆర్ఎస్లో వచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తాసిల్దారులు పిటిషనర్ తో మాట్లాడటం లేదని, రీ సర్వేలో ప్రతి ఒక్కరు ఎండార్స్మెంట్ కాపీ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిపారని, మనం పనిచేసినా కూడా చేయలేదనే భావన కలుగుతుందన్నారు. తప్పనిసరిగా పిటీషనర్ తో మాట్లాడాలని సూచించారు.
రీ సర్వేలో నరసరావుపేట 193, ఎడ్లపాడు 151, అచ్చంపేట 109, సత్తెనపల్లి 105 గ్రీవెన్స్ వచ్చాయని ఇవిగాక చాలా గ్రీవెన్స్ సెక్రటేరియట్ కు వెళుతున్నాయని, శాసనసభ్యులు గ్రీవెన్స్ కూడా ఇస్తున్నారని, రెవెన్యూ క్లినిక్ లో కూడా గ్రీవెన్స్ ఇస్తున్నట్లు తాసిల్దార్లకుకు తెలియజేశారు.
సంయుక్త కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 588(రెవెన్యూ ల్యాండ్స్-1) డిపార్ట్మెంట్ తేదీ 15.9.26 అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977, విలేజ్ సర్వీస్ ఇనాం భూములు , షరతులు గల పట్టాల్యాండ్స్ పై తాసిల్దార్లకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో పులిచింతల డిప్యూటీ కలెక్టర్ లీలారాణి, నరసరావుపేట ,సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు, మండల తాసిల్దారులు, సర్వేయర్లు,సెక్షన్ సూపరింటెండెంట్ లు వీఆర్వోలు పాల్గొన్నారు.
