Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన జ్యోతి వెంకట పార్ధు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన జ్యోతి వెంకట పార్ధు

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు:ఆల్ ఇండియా జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం (Gold Medal) సాధించి ఆత్మకూరుకు గర్వకారణంగా నిలిచాడు జ్యోతి వెంకట పార్ధు.
  • ఆత్మకూరులోని సెయింట్ మైరీస్ (St.
  • Myre) పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పార్ధు తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.

ఆత్మకూరు:ఆల్ ఇండియా జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం (Gold Medal) సాధించి ఆత్మకూరుకు గర్వకారణంగా నిలిచాడు జ్యోతి వెంకట పార్ధు. ఆత్మకూరులోని సెయింట్ మైరీస్ (St. Myre) పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పార్ధు తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.

జ్యోతి శ్రీనివాసులు కుమారుడైన వెంకట పార్ధు చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సాధించిన విజయంపై పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన పార్ధు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *