వార్త ముఖ్యాంశాలు
- – మెట్ట ప్రాంతానికే అవకాశం కల్పించాలనే డిమాండ్ నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి వైసీపీ నుంచి ఇప్పటికే బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరు దాదాపు ఖరారు కాగా, నిన్నమొన్నటి వరకు కూటమి అభ్యర్థులుగా పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉండేవి.
- అయితే తాజాగా కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి , మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి .
- మెట్ట ప్రాంతానికి అవకాశం కల్పించాలనే డిమాండ్ ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది.
– మెట్ట ప్రాంతానికే అవకాశం కల్పించాలనే డిమాండ్
నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి వైసీపీ నుంచి ఇప్పటికే బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరు దాదాపు ఖరారు కాగా, నిన్నమొన్నటి వరకు కూటమి అభ్యర్థులుగా పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉండేవి. అయితే తాజాగా కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి , మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి .
మెట్ట ప్రాంతానికి అవకాశం కల్పించాలనే డిమాండ్ ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది. ఆర్థిక, అంగబలాలు కలిగి, కావలి ప్రాంతంలోని జలదంకి ప్రాంతానికి చెందిన ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి టీడీపీలో సీనియర్ నేత. గతంలో కావలి ఎమ్మెల్యేగా ఆయన పనిచేసి ఉన్నారు. కావలి, ఉదయగిరి, ఆత్మకూరు తదితర నియోజకవర్గాల్లో ఒంటేరుకు మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి.
వివాదాస్పదుడిగా, వినయ విధేయతలు గలవాడిగా ఒంటేరుకు మంచి పేరు ఉండగా, ఆయన అభ్యర్థిత్వాన్ని ఉదయగిరి ప్రాంతంలోని నేతలైన కంభం విజయరామిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబు యాదవ్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నేతలు బలంగా ప్రతిపాదిస్తున్నట్లు తెలియవస్తోంది.
ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఇప్పటికే మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరును దాదాపు ఖరారు చేసుకొని ప్రకటించే సమయంలో ఉన్న నేపథ్యంలో, కూటమి కూడా మెట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తికే నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దీంతో కూటమి అగ్రనేతలు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
అయితే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేరుతోపాటు మాజీ డీసీసీ బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి పేరు కూడా తాజాగా వినిపించడం గమనార్హం. మెట్టుకూరు కూడా మెట్ట ప్రాంతానికి చెందినవాడే కాక, ఆర్థిక, అంగబలాలు ఉన్న వ్యక్తి కావడంతో కూటమి పెద్దలు ఈ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరి చివరికి కూటమి అభ్యర్థిత్వం ఎవరికి దక్కేనో… ఆ పీఠం ఎవరి చేతికి చిక్కేనో?