Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

చెరుకులపాడులో ఘనంగా ఉగాది వేడుకలు.. భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణం, రథోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెరుకులపాడులో ఘనంగా ఉగాది వేడుకలు.. భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణం, రథోత్సవం

కర్నూల్ (పున్నమి ప్రతినిధి)
కర్నూలు జిల్లా, వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. పండుగను పురస్కరించుకుని స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు శ్రీ శ్రీ శ్రీ గౌరీ శంకర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ యు.యం. రుద్రయ్య స్వామి వారి ఆధ్వర్యంలో ‘పంచాంగ శ్రవణం’ కార్యక్రమం జరిగింది. నూతన సంవత్సరంలో గ్రహగతులు, పాడిపంటలు, రాశి ఫలాల గురించి రుద్రయ్య స్వామి వారు భక్తులకు వివరించారు.
పంచాంగ శ్రవణం అనంతరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి పల్లకి ఉత్సవాన్ని మరియు శ్రీ బీరప్ప స్వామి వారి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తరించారు.
ఈ ఉగాది వేడుకల్లో గ్రామ పెద్దలు సురేంద్ర స్వామి, వంశీధర్ రెడ్డి, మోహన్ రెడ్డి, నరసింహారావు, బత్తిన చిన్న వెంకటప్ప, ఎర్రమల, చాకలి శివ, మనోహర్ లతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు, యువకులు అత్యుత్సాహంగా పాల్గొన్నారు.

చెరుకులపాడులో ఘనంగా ఉగాది వేడుకలు.. భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణం, రథోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *