Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

చెట్లు కొట్టాలి.. షెడ్డు కట్టాలి..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెట్లు కొట్టాలి.. షెడ్డు కట్టాలి..!
oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • చెట్లు కొట్టాలి..
  • షెడ్డు కట్టాలి..!
  • హయత్‌నగర్‌లో ఇదే తంతు?

చెట్లు కొట్టాలి.. షెడ్డు కట్టాలి..!

హయత్‌నగర్‌లో ఇదే తంతు?

డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 5లో చెట్ల తొలగింపుపై ఆరోపణలు

టౌన్‌ ప్లానింగ్‌, మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ప్రశ్నలు

హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 9:
హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో చెట్ల తొలగింపు, అనంతరం షెడ్ల నిర్మాణంపై స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 5లోని ఓ షెడ్డు ఎదురుగా ఉన్న చెట్లను తొలగించారనే ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

షెడ్డు నిర్మాణానికి అడ్డుగా చెట్లు ఉన్నాయనే కారణంతో వాటిని తొలగించారా? లేక ఇతర కారణాలతో చెట్లను తొలగించారా? అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. చెట్ల తొలగింపునకు సంబంధించి అనుమతులు ఉన్నాయా? సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? అనే విషయాలపై విచారణ జరపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

హయత్‌నగర్‌ సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు చెట్ల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే.. మరోవైపు నిర్మాణాల కోసం చెట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు రావడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది.

టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, షెడ్ల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? చెట్ల తొలగింపునకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటారా?

చెట్లను తొలగించి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌ 5లో జరిగినట్లు చెబుతున్న చెట్ల తొలగింపు ఘటనపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

అయితే చెట్ల తొలగింపు, షెడ్డు నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఉన్నాయా లేదా అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *