Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న చింతు వాసుదేవరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గుండివిల్లిపేట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న కరవంజ గ్రామానికి చెందిన చింతు వాసుదేవరావు గారు 2025 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గోండు శంకర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో…
  • ఈ గుర్తింపు మరింత కృషి చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుంది” అని తెలిపారు.గ్రామ ప్రజలు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, విద్యా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గుండివిల్లిపేట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న కరవంజ గ్రామానికి చెందిన చింతు వాసుదేవరావు గారు 2025 సంవత్సరానికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గోండు శంకర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఘనమైన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.వాసుదేవరావు గారు విద్యార్థులలో పఠన పట్ల ఆసక్తి పెంపొందించడం, సృజనాత్మకతను వెలికితీయడం, పాఠశాలలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించడం వంటి విశేష కృషిని పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా వాసుదేవరావు గారు మాట్లాడుతూ – “విద్యార్థుల విజయం నా విజయమని ఎల్లప్పుడూ నమ్ముతాను. ఈ గుర్తింపు మరింత కృషి చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుంది” అని తెలిపారు.గ్రామ ప్రజలు, సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, విద్యా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *