Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చల్లపాలెంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి-ఆరుగురు అరెస్ట్, రూ.11 వేలు స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ కాళహస్తి, జూన్ 21, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి రూరల్ మండలం చల్లపాలెం బీసీ కాలనీకి పడమర వైపున ఉన్న బహిరంగ ప్రదేశంలో శనివారం సాయంత్రం సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.
  • ఆదివారం సాయంత్రం అందిన పక్కా సమాచారం మేరకు రూరల్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు.
  • ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీ కాళహస్తి, జూన్ 21, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి రూరల్ మండలం చల్లపాలెం బీసీ కాలనీకి పడమర వైపున ఉన్న బహిరంగ ప్రదేశంలో శనివారం సాయంత్రం సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఆదివారం సాయంత్రం అందిన పక్కా సమాచారం మేరకు రూరల్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 11,000 నగదుతో పాటు పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ఇటువంటి వాటిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *