వార్త ముఖ్యాంశాలు
- జోగులాంబ గద్వాల్ అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి ) చలో చెన్నై – మూడవ జాతీయ మహాసభలకు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి భారీగా తరలింపు!
- మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (MNS) ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 17, 18, 19 తేదీలలో తమిళనాడులోని చెన్నైలో నిర్వహించనున్న మూడవ జాతీయ మహాసభలకు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి భారీ ఎత్తున తరలివెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- ఈ కార్యక్రమంలో భాగంగా MNS తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఏదుల నాగరాజు ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి సుమారు 50 మంది మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, సంఘ శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఈ జాతీయ మహాసభల్లో పాల్గొననున్నారు.
జోగులాంబ గద్వాల్ అక్టోబర్ 14 (పున్నమి ప్రతినిధి )
చలో చెన్నై – మూడవ జాతీయ మహాసభలకు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి భారీగా తరలింపు!
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (MNS) ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 17, 18, 19 తేదీలలో తమిళనాడులోని చెన్నైలో నిర్వహించనున్న మూడవ జాతీయ మహాసభలకు జోగులాంబ గద్వాల జిల్లా నుంచి భారీ ఎత్తున తరలివెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా MNS తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఏదుల నాగరాజు ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి సుమారు 50 మంది మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, సంఘ శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఈ జాతీయ మహాసభల్లో పాల్గొననున్నారు.
🔥 శాస్త్రీయ దృక్పథం – సామాజిక సమానత్వం – మానవత్వమే మా లక్ష్యం!
సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలను రూపుమాపడం, ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడం, ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించడం, కులవివక్షను నిర్మూలించడం, రాజ్యాంగ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి ఆశయాలతో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నిరంతరం కృషి చేస్తోంది.
ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న మూడవ జాతీయ మహాసభలు దేశవ్యాప్తంగా హేతువాద, సామాజిక న్యాయ ఉద్యమ శక్తులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి దోహదపడనున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఉద్యమకారులు తమ అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.
ప్రజలు భయాలు, అంధవిశ్వాసాల నుంచి బయటపడి, తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని, ప్రశ్నించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని సంఘం పిలుపునిస్తోంది.
మూఢనమ్మకాలపై పోరాటం ఒకరి బాధ్యత కాదు… సమాజం మొత్తానికి సంబంధించిన బాధ్యత!
చలో చెన్నై… కదలిరండి! శాస్త్రీయ ఆలోచనల కోసం కదలిరండి! సామాజిక సమానత్వం కోసం కదలిరండి! మానవత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం కదలిరoడి అని పిలుపునిచ్చారు