Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ సెప్టెంబర్ 7వ తేదిన (2025) చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 3.30 గంటల నుండి 8వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న విషయం విదితమే.
  • ఈ కారణంగా సెప్టెంబర్ 8వ తారీఖు దర్శనం కొరకు 7వ తేది వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
  • 8వ తేది నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు.

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @
సెప్టెంబర్ 7వ తేదిన (2025) చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 3.30 గంటల నుండి 8వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న విషయం విదితమే.

ఈ కారణంగా సెప్టెంబర్ 8వ తారీఖు దర్శనం కొరకు 7వ తేది వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. 8వ తేది నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు.

7వ తేదిన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేయడం జరిగింది.

సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా సెప్టెంబర్ 15వ తేదిన వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.

సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *