Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఘనంగా స్నేహితుల దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా స్నేహితుల దినోత్సవం

మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సందడి

ముథోల్, ఆగస్టు 2 (పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముథోల్‌తో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుని, స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. పలువురు యువకులు, విద్యార్థులు కలిసి కేక్‌లు కట్ చేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. స్నేహం జీవితంలో ఎంతో విలువైనదని, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే నిజమైన స్నేహితులను గౌరవించాలని పలువురు పేర్కొన్నారు. స్నేహితులతో కలిసి ఫొటోలు దిగుతూ సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు పంచుకున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో స్నేహితుల దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి.

ఘనంగా స్నేహితుల దినోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *