Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.. అన్నయ్యకు రాఖీ కట్టిన చెల్లెమ్మలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.. అన్నయ్యకు రాఖీ కట్టిన చెల్లెమ్మలు

పున్నమి: నాగర్‌కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు కుటుంబంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా దూపం అంజనేయులు కుమార్తెలు దూపం పావని, దూపం లక్ష్మీ ప్రియ, దూపం దేవి ప్రియ తమ అన్నయ్య దూపం ఖండేశ్వర్కు రాఖీలు కట్టి, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమను చాటుకున్నారు. అనంతరం అన్నయ్యకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నయ్య ఖండేశ్వర్ తన చెల్లెమ్మలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సుఖసంతోషాలను కోరుకుంటూ ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ ఐక్యతను ప్రతిబింబించేలా జరిగిన ఈ రక్షాబంధన్ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి.

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.. అన్నయ్యకు రాఖీ కట్టిన చెల్లెమ్మలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *