Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • అంగన్‌వాడీ కేంద్రానికి రూ.4 వేల విలువైన టేబుళ్ల విరాళం ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎల్.ఆర్.పల్లి 1వ సెంటర్ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
  • అంగన్‌వాడీ కార్యకర్త షకీలా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్‌వైజర్ జి.
  • కస్తూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అంగన్‌వాడీ కేంద్రానికి రూ.4 వేల విలువైన టేబుళ్ల విరాళం

ఆత్మకూరు, నవంబర్ 14 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎల్.ఆర్.పల్లి 1వ సెంటర్ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్త షకీలా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్‌వైజర్ జి. కస్తూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రానికి స్థానిక లబ్ధిదారులు, DEIC కౌన్సిలర్ దేవరాల వెంకట రమణయ్య, ఆయన తల్లి ఎంగమ్మ, సతీమణి దేవరాల స్వాతి, కుమార్తె దుష్యంతి పేర్ల మీదుగా రూ.4 వేల విలువైన టేబుళ్లను విరాళంగా అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు తమ వంతు సహకారం అందించడం పట్ల పలువురు అభినందించారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్త షకీలా విరాళం అందించిన దేవరాల కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల అభివృద్ధికి, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *