Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రామాల్లో ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయాలిముత్యాల విజయ్ చంద్ర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గ్రామాల్లో ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయాలిముత్యాల విజయ్ చంద్ర

వార్త ముఖ్యాంశాలు

  • సంగం మండలంలోని జంగాలకండ్రిగ, మర్రిపాడు, వంగల్లు గ్రామాల్లో ఆధార్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, గిరిజనులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర కోరారు.
  • ఈ మేరకు సెప్టెంబర్ 5న నెల్లూరు టౌన్ ఆధార్ సెంటర్ మేనేజ్‌మెంట్ దిలీప్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు.ఆధార్ సమస్యల కారణంగా పలువురు పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, గ్రామస్థాయిలోనే ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
  • అలాగే కొత్తగా ఆధార్ కార్డు పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను తెలుసుకున్నారు.

సంగం మండలంలోని జంగాలకండ్రిగ, మర్రిపాడు, వంగల్లు గ్రామాల్లో ఆధార్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, గిరిజనులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేయాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల విజయ్ చంద్ర కోరారు.
ఈ మేరకు సెప్టెంబర్ 5న నెల్లూరు టౌన్ ఆధార్ సెంటర్ మేనేజ్‌మెంట్ దిలీప్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు.ఆధార్ సమస్యల కారణంగా పలువురు పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, గ్రామస్థాయిలోనే ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
అలాగే కొత్తగా ఆధార్ కార్డు పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను తెలుసుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండదండలతో త్వరలో మండల అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన డాక్యుమెంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని విజయ్ చంద్ర తెలిపారు.ఐదేళ్లకు ఒకసారి ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సిన వారు కూడా ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *