వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు.
- బుధవారం చిట్వేల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు.
- కార్యక్రమానికి ఏఐటీయూసీ రైల్వేకోడూరు నియోజకవర్గ అధ్యక్షుడు మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర హాజరయ్యారు.
చిట్వేల్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం చిట్వేల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏపీ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ రైల్వేకోడూరు నియోజకవర్గ అధ్యక్షుడు మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర హాజరయ్యారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు కల్పించాలని, డీపీఓ సంతకంతో గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, పనిముట్లు, యూనిఫాం, భద్రతా పరికరాలు అందించాలని కోరారు. గ్రామాల విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా మంచాల నరేష్, కార్యదర్శిగా గుర్రాల సుబ్బరాయుడు, కోశాధికారిగా ఎం. రామకృష్ణ ఎన్నికయ్యారు.