Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

గొర్రె కాపర్ల లో చదువుకున్న నిరుద్యోగ యువతకు 30 లక్షలతో గొర్రెల ఫామ్ నిర్మాణానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలి. కాట్రాల తిరుపతి రావు డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గొర్రె కాపర్ల లో చదువుకున్న నిరుద్యోగ యువతకు 30 లక్షలతో గొర్రెల ఫామ్ నిర్మాణానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలి. కాట్రాల తిరుపతి రావు డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • సుజాత నగర్ పున్నమి ప్రతి నిధి చల్లగుండ్ల నరేష్ ఆగష్టు 07 : జి ఎమ్ పి ఎస్ సుజాతనగర్ మండల మహాసభ చింతలపూడి సత్యం భవన్ లో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలికూర శ్రీనివాస్ అధ్యక్షతన మహాసభ లో సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు…
  • ఈ కార్యక్రమంలో చిమట వెంకటేష్మా,రుతి గోపాలరావు,బట్టా రామారావు, కంపాసాటి వీరభద్రం,నర్సింగ్, శ్రీను, మర్రి మురళి కృష్ణ,కాట్రేవుల మల్లయ్య, కొచ్చర్ల నాగరాజు,జక్కుల రాజు,గిల్లాక అశోక్, నరేష్, చప్పిడి సీతారాములు, గొళ్ళు నాగేశ్వరావు, ఎర్రబోయిన రాజు,పగడాల కిష్టయ్య, చిలక సాయి, మారుతి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

సుజాత నగర్ పున్నమి ప్రతి నిధి చల్లగుండ్ల నరేష్ ఆగష్టు 07 : జి ఎమ్ పి ఎస్ సుజాతనగర్ మండల మహాసభ చింతలపూడి సత్యం భవన్ లో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలికూర శ్రీనివాస్ అధ్యక్షతన మహాసభ లో సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు మాట్లాడుతూ గొర్రె కాపర్ల లో చదువుకున్న నిరుద్యోగ యువతకు 30 లక్షలతో గొర్రెల ఫామ్ నిర్మాణానికి ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని.గొర్రెలకు మేకలకు సాగుకు ఉపయోగపడని ప్రభుత్వ భూమిని గొర్రెల మేతకు సొసైటీలకు కేటాయించి జీవో నెం 559 ని పకడ్బందీగా అమలు చేయాలని.తుమ్మ చెట్లపై గొర్రెల పెంపకదారులకు హక్కును కల్పించే జీవో నెం 1016 ను పటిష్టంగా అమలు చేయాలని.తుమ్మ చెట్లపై గొర్రెల పెంపకదారులకు హక్కును కల్పించే జీవో నెం 432 ను ప్రభుత్వం ప్రతిష్టంగా అమలు చేయాలని.గొర్రెలు కాస్తున్న సమయంలో ప్రమాదాల్లో మరణించిన గొర్రెల కాపరులకు వర్తించే ఎక్స్ గ్రేషియా జీవో నెం 64 ని ప్రభుత్వం అమలు చేయాలని.పిడుగుపాటుతో మరణించే వారికి ఆర్థిక సాయం జీవో నెం 2 ని పకడ్బందీగా అమలు చేయాలని.ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జి ఎమ్ పి ఎస్సుజాతనగర్ మండల మహాసభ లో నూతన అధ్యక్ష కార్యదర్శులు గా చేతుల పరమయ్య, మర్రి మల్లిఖార్జునరావు మరియు 11 మంది తో నూతన కమిటీ ఎన్నకోవడం జరిగింది.ఆగస్టు 20న సుజాత నగర్ లో జరిగే జి ఎమ్ పి ఎస్ జిల్లా మహాసభ జయప్రదం చేయాలనీ ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో చిమట వెంకటేష్మా,రుతి గోపాలరావు,బట్టా రామారావు, కంపాసాటి వీరభద్రం,నర్సింగ్, శ్రీను, మర్రి మురళి కృష్ణ,కాట్రేవుల మల్లయ్య, కొచ్చర్ల నాగరాజు,జక్కుల రాజు,గిల్లాక అశోక్, నరేష్, చప్పిడి సీతారాములు, గొళ్ళు నాగేశ్వరావు, ఎర్రబోయిన రాజు,పగడాల కిష్టయ్య, చిలక సాయి, మారుతి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *