Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

గుండ్లూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో శివ ముక్కోటి మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుండ్లూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో శివ ముక్కోటి మహోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు గ్రామ సమీపంలోని చేయరు నదీ తీరాన వెలసిన శ్రీ అన్నపూర్ణా సమేత అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 03-01-2026, శనివారం నాడు శివ ముక్కోటి (పుష్య శుద్ధ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు…
  • ​కార్యక్రమ వివరాలు: ​ఉదయం 7:00 గంటలకు: మహాగణపతి పూజ, స్వస్తి వాచనము, మహాన్యాస పారాయణము, ప్రధాన దేవతా కలశస్థాపనలు.
  • అనంతరం మహాగణపతి, రుద్ర, చండీ, ప్రత్యంగిరా హోమములు నిర్వహించబడతాయి.

కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు గ్రామ సమీపంలోని చేయరు నదీ తీరాన వెలసిన శ్రీ అన్నపూర్ణా సమేత అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 03-01-2026, శనివారం నాడు శివ ముక్కోటి (పుష్య శుద్ధ పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు శ్రీ చాపాటి శివయ్య స్వామి ఒక ప్రకటనలో తెలిపారు.

​కార్యక్రమ వివరాలు:

​ఉదయం 7:00 గంటలకు: మహాగణపతి పూజ, స్వస్తి వాచనము, మహాన్యాస పారాయణము, ప్రధాన దేవతా కలశస్థాపనలు. అనంతరం మహాగణపతి, రుద్ర, చండీ, ప్రత్యంగిరా హోమములు నిర్వహించబడతాయి.

​మధ్యాహ్నం 12:00 గంటలకు:

విశేష ‘మహాపూర్ణాహుతి’ కార్యక్రమం జరుగును.
​ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు బ్రహ్మశ్రీ బండాత్మకూరు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో, 16 మంది రుత్విక్కులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
​ఉభయదారులుగా చేరదలచిన భక్తులు రూ. 1516/- చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు:
​శ్రీ చాపాటి శివయ్య స్వామి: 9491222551
​బ్రహ్మశ్రీ బండాత్మకూరు శివకుమార్ శర్మ: 9866809476
​బ్రహ్మశ్రీ బనగానపల్లె సంతోష్ కృష్ణ శర్మ: 9701607510

Leave a comment

Your email address will not be published. Required fields are marked *