Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

గాంధీ స్మారక నిధి సత్కారం”తిరుమలరావుకు”

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  •     శ్రీకాకుళం జిల్లా కేంద్రాన గాంధీ స్మారక నిధి వారి నేతృత్వంలో నిర్వహించిన గాంధీవర్ధంతి సభలో రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావుకు సత్కారం జరిగింది.
  • గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం శాంతినికేతన్‌ లో గాంధీ స్మారకనిధి అధ్యక్షులు సురంగి మోహనరావు అధ్యక్షతన జరిగిన 'గాంధేయం- భారతీయ జీవనవేదం' అను పుస్తకాన్ని రాష్ట్ర కవిటీ సభ్యులు, జిల్లా కన్వీనర్ మేడూరి ప్రసాదరావు, కార్యనిర్వాహక సభ్యులు ఎం వి ఎస్ ఎస్ శాస్త్రి ఆవిష్కరించీ, అనంతపురం…
  • తిరుమలరావు రచించిన 'సమతాదీప్తి - శాంతికి స్ఫూర్తి' అను కవిత ఎంపికై, ఈ పుస్తకంలో స్థానం పొందింది.

 

 

శ్రీకాకుళం జిల్లా కేంద్రాన గాంధీ స్మారక నిధి వారి నేతృత్వంలో నిర్వహించిన
గాంధీవర్ధంతి సభలో
రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావుకు సత్కారం జరిగింది.
గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం శాంతినికేతన్‌ లో గాంధీ స్మారకనిధి అధ్యక్షులు సురంగి మోహనరావు అధ్యక్షతన జరిగిన ‘గాంధేయం- భారతీయ జీవనవేదం’ అను పుస్తకాన్ని రాష్ట్ర కవిటీ సభ్యులు, జిల్లా కన్వీనర్ మేడూరి ప్రసాదరావు, కార్యనిర్వాహక సభ్యులు ఎం వి ఎస్ ఎస్ శాస్త్రి ఆవిష్కరించీ, అనంతపురం తిరుమలరావును సత్కరించారు.
తిరుమలరావు రచించిన ‘సమతాదీప్తి – శాంతికి స్ఫూర్తి’ అను కవిత ఎంపికై,
ఈ పుస్తకంలో స్థానం పొందింది.
ఈ సందర్భంగా తిరుమలరావు గాంధీపుట్టినదేశం గీతాన్ని,
వేదికపై వినిపించీ సభికుల ప్రశంసలు పొందారు.
గాంధీ స్మారకనిధి సభ్యులు
బి లక్ష్మణరావు,
జామి భీమశంకర్,
గాంధేయవాది
బరాటం కామేశ్వరరావు,
సాహితీవేత్తలు పులఖండం శ్రీనివాసరావు,
పివిఎస్ రామమోహన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రామమోహనరావు,
తెలుగు రచయితల వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉత్తరావిల్లి నాగేశ్వరరావు,
రఘుపాత్రుని వెంకట రమణమూర్తి,
తెరవే సభ్యులు వావిలపల్లి రాజారావు, ఐ ఎన్ డి ప్రసాదరావు, మంగిపూడి శ్రీనివాసరావు తదితరులు తిరుమలరావును సత్కరించారు.
అహింసనే పవిత్రతను లోకానికి అందించి, శతాబ్ధి వ్యక్తిగా నిలిచి, పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసమే స్వాతంత్ర్యమని పిలుపునిచ్చి, భారతదేశానికి జాతిపితగా, సమతాదీప్తిగా, శాంతికి స్ఫూర్తిగా మహాత్ముడైనారని
తిరుమలరావు తన రచనలో గాంధీజీ గూర్చి పలు భావాలను వెలిబుచ్చిరి.
గాంధేయం- భారతీయ జీవనవేదం పుస్తకంలో తిరుమలరావు కవిత చోటు దక్కించుకొని, గాంధీ స్మారక నిధి వారిచే సత్కారాన్ని పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్‌ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *