Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

గాంధీ జయంతి సందర్భంగా సమాజ సేవకు తరలి రండి – పర్యావరణ పరిరక్షణలో మీరు భాగస్వామ్యలు కండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గాంధీ జయంతి సందర్భంగా సమాజ సేవకు తరలి రండి – పర్యావరణ పరిరక్షణలో మీరు భాగస్వామ్యలు కండి

తీర ప్రాంత రక్షణ వనాలు పెంచుదాం సహకరించండి.
– సమాజ సేవ ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించండి
– జెవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ

విశాఖపట్నం:

గాంధీ జయంతి సందర్భంగా సమాజ సేవకు తరలి రండి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు . గురువారం ఉదయం ఆళ్వార్ దాస్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన ఎన్సిసి క్యాడేట్లకు గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో రత్నం పర్యావరణ పరిరక్షణ ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రస్తుతం శీతోష్ణస్థితి వేడెక్కిపోతున్న తరుణంలో, శీతోష్ణస్థితి మార్పు, ఎల్ నినో సూపర్ ఎల్ నినో లో నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయవలసిన అవసరం ఏర్పడిందన్నారు. అలాగే శీతోష్ణస్థితి వేడెక్కుతున్న తరుణంలో మంచు కొండలు కరగడం, సముద్ర నీటిమట్టం పెరగడం, తీరప్రాంతాల కోతకు గురవడం అధికంగా జరుగుతుందని పేర్కొన్నారు. దీనిని అధిగమించడానికి తీర ప్రాంత రక్షణ వనాలు పెంచుదాం సహకరించండి అని కోరారు. తీర ప్రాంత రక్షణ కోసం మొగలి వనాలు, తాటి తోపులు, సరుగుడు తోటలు పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అలాగే తీరం లొ ఇసుక తిన్నెలను కాపాడేందుకు సీ గ్రాస్, మోర్నింగ్ గ్లోరీ, పల్లేరు మొక్కలను పెంచుదాం అన్నారు. తీరంలో పెరుగుతున్న అన్ని మొక్కలను పరిశీలించి మిగిలిన ప్రాంతాలకు వ్యాప్తి చేద్దాం అని అన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ సమాజ సేవ ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. రేపటి పౌరులుగా నేటి యువత ఉన్నత స్థాయిలో సమాజసేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ రాజా ఉమెన్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ఊర్మిళ, యాక్షన్ ఎయిట్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు.

గాంధీ జయంతి సందర్భంగా సమాజ సేవకు తరలి రండి – పర్యావరణ పరిరక్షణలో మీరు భాగస్వామ్యలు కండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *