Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

​ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: SFI జిల్లా కార్యదర్శి పైసా గణేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
​ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: SFI జిల్లా కార్యదర్శి పైసా గణేష్

వార్త ముఖ్యాంశాలు

  • ​భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను నాయకులు సందర్శించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
  • కళాశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం మరియు ల్యాబ్ సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను నాయకుల దృష్టికి తెచ్చారు.
  • ​ఈ సందర్భంగా SFI వరంగల్ జిల్లా కార్యదర్శి పైసా గణేష్ మాట్లాడుతూ..

​భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను నాయకులు సందర్శించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడం మరియు ల్యాబ్ సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను నాయకుల దృష్టికి తెచ్చారు.
​ఈ సందర్భంగా SFI వరంగల్ జిల్లా కార్యదర్శి పైసా గణేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థులకు సదుపాయాలు అందే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
​ఈ కార్యక్రమంలో SFI నాయకులు మణికంఠ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *