Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఖానాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గుగులోతు రామ్మోహన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖానాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గుగులోతు రామ్మోహన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు,

ఖానాపూర్, (పున్నమి ప్రతినిధి): ఖానాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గుగులోతు రామ్మోహన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో కేక్ కట్ చేసి, రామ్మోహన్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన అందిస్తున్న సేవలను బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. రామ్మోహన్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ సదర్ లాల్, మాజీ జెడ్పీటీసీ గుగులోతు బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ బోడ పూలు, సర్పంచులు వీరన్న, బాలకిషన్, ప్రవీణ్, మాజీ సర్పంచులు భూక్య వెంకన్న, సుమన్, రమేష్, పార్టీ అధ్యక్షులు రెడ్డి, బందారపు శ్రీనివాస్ గౌడ్, ముద్దంగుల రవీందర్, దంజ్యా నాయక్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖానాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గుగులోతు రామ్మోహన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *