వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్ జిల్లా అక్టోబర్ 08 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ : నిర్మల్ జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది..
- లంచం తీసుకుంటుండగా ఓ అటవీశాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
- నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీశాఖ కార్యాలయంలో టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు.
నిర్మల్ జిల్లా అక్టోబర్ 08 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ : నిర్మల్ జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది.. లంచం తీసుకుంటుండగా ఓ అటవీశాఖ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీశాఖ కార్యాలయంలో టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. పర్మిషన్ ఇవ్వడానికి ఎఫ్ఎస్ఓ రవీందర్ 12 వేలు డిమాండ్ చేశారు. దీంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఏసీబీ అధికారులు టింబర్ డిపో పర్మిషన్ కోసం వ్యక్తి వద్ద నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం…ఖానాపూర్ పట్టణానికి చెందిన కామోజీ రవితేజ తన టింబర్ డిపో రెన్యూవల్ కోసం ఆగస్టు నెలలో దరఖాస్తు చేసుకున్నాడు. పర్మిషన్ కోసం ఎఫ్ఎస్ఓ రవీందర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని రవితేజ చెప్పినా, లంచం ఇస్తేనే పర్మిషన్ ఇస్తానని తేల్చి చెప్పాడు. దీంతో రూ.12 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నరు. బాధితుడు రవితేజ ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రవీందర్ ను పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమని, చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.