వార్త ముఖ్యాంశాలు
- 17 మందికి జిల్లా ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం ఖమ్మం, అక్టోబర్ 4 (పున్నమి): భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా సంస్థాగత వ్యవహారాల్లో భాగంగా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు 17 మందిని జిల్లా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.
- ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు నియామకాలను ప్రకటించారు.
- నూతనంగా నియమితులైన వారిలో డా.
17 మందికి జిల్లా ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం
ఖమ్మం, అక్టోబర్ 4 (పున్నమి):
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా సంస్థాగత వ్యవహారాల్లో భాగంగా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు 17 మందిని జిల్లా ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వరరావు నియామకాలను ప్రకటించారు.
నూతనంగా నియమితులైన వారిలో డా. శీలం పాపారావు, వల్లబనేని పుల్లయ్య, దాసరి వెంకటేశ్వర్లు, వెల్పుల సుధాకర్, టేకుమట్ల వీరగౌడ్, కొలిపాక శ్రీదేవి, దొడ్డ అరుణ, మద్దినేని వెంకటేశ్వరరావు, ఆతి విజయారెడ్డి, కోటేరు మోహన్‌రెడ్డి, తురక నారాయణ, పడిగెల మధుసూదన్‌రావు, మండ పాపారావు, ఎదుల వీరభద్రం, కోవ్వూరి నాగేశ్వరరావు, మట్ట దుర్గాప్రసాద్‌రెడ్డి, బజ్జూరి మల్లారెడ్డి ఉన్నారు.
వీరికి ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పార్టీ తరఫున చురుకైన పాత్ర పోషించే బాధ్యతలు అప్పగించనున్నారు. తాజా నియామకాలతో జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊపు వస్తుందని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.