Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

క్రాప గ్రామంలో పీస్ కమిటీ ఏర్పాటు … పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలీ :డీఎస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
క్రాప గ్రామంలో పీస్ కమిటీ ఏర్పాటు … పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలీ :డీఎస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • క్రాప గ్రామంలో పీస్ కమిటీ ఏర్పాటు..
  • శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: డీఎస్పీ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి: అయినవిల్లి మండలం క్రాప గ్రామంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు పీస్ కమిటీని ఏర్పాటు చేశారు.
  • జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, పి.గన్నవరం సీఐ భీమరాజు, అయినవిల్లి ఎస్సై కె.జ్యోతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

క్రాప గ్రామంలో పీస్ కమిటీ ఏర్పాటు.. శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: డీఎస్పీ

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి:

అయినవిల్లి మండలం క్రాప గ్రామంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు పీస్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, పి.గన్నవరం సీఐ భీమరాజు, అయినవిల్లి ఎస్సై కె.జ్యోతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ.. క్రాప గ్రామంలో నిర్వహించే వనువులమ్మ జాతర, దసరా ఉత్సవాలను గ్రామస్థులందరూ సోదరభావంతో, పరస్పర సామరస్యంతో జరుపుకోవాలని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని, చట్ట నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *