Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్యాన్సర్ బాధితులకు అండగా జనసేన నేత కిషోర్ గునుకుల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
క్యాన్సర్ బాధితులకు అండగా జనసేన నేత కిషోర్ గునుకుల

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు రూరల్ కొండాయపాలెంలో అబౌండింగ్ హోప్ చర్చి ఆధ్వర్యంలో డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 170 మంది క్యాన్సర్ బాధితులకు పోషకాహారం, భోజనం పంపిణీ చేశారు.
  • ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నాయకులు కిషోర్ గునుకుల బాధితులకు ఆహారం అందించి ధైర్యం చెప్పారు.
  • గల్ఫ్ దేశాల్లోయుద్ధ వాతావరణంలో చిక్కుకున్న వేళ, ఒక్క ఫోన్ కాల్‌తో అక్కడి జనసైనికులు స్వయంగా చేరుకుని స్పందించి..

నెల్లూరు రూరల్ కొండాయపాలెంలో అబౌండింగ్ హోప్ చర్చి ఆధ్వర్యంలో డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 170 మంది క్యాన్సర్ బాధితులకు పోషకాహారం, భోజనం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నాయకులు కిషోర్ గునుకుల బాధితులకు ఆహారం అందించి ధైర్యం చెప్పారు.
గల్ఫ్ దేశాల్లోయుద్ధ వాతావరణంలో చిక్కుకున్న వేళ, ఒక్క ఫోన్ కాల్‌తో అక్కడి జనసైనికులు స్వయంగా చేరుకుని స్పందించి.. కేవలం 36 గంటల్లో 60 మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తి మరువలేనిది.”
క్యాన్సర్ బాధితులు ఆశను వదులుకోవద్దని, ఈ పోరాటంలో వారు ఒంటరిగా లేరని అన్నారు. ప్రతి నెలా బాధితులకు పోషకాహారం అందిస్తున్న డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ సేవలను అభినందించారు.
అలాగే ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే జనసేన సేవా స్ఫూర్తి అని పేర్కొంటూ, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న 60 మందిని 36 గంటల్లో సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంలో సేవలందించిన వేములపాటి అజయ్‌ను అభినందించారు. కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, సేవాభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *