Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

కోడేరు రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

కోడేరు మండల రైతువేదికలో వ్యవసాయ శాఖ, జయశంకర్ అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం సోమవారం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వరి, పత్తితో పాటు కూరగాయలు, చిరుధాన్యాలు సాగు చేయాలన్నారు. శాస్త్రవేత్త మమత మాట్లాడుతూ.. సకాలంలో విత్తడం ద్వారా నీటి ఇబ్బందులు అధిగమించవచ్చని, యూరియా తగ్గించి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని సూచించారు. శాస్త్రవేత్త ఈశ్వర్ రెడ్డి రసాయనాల సరైన వినియోగం, మేలైన వరి రకాలను వివరించారు. ఏవో పంటల నమోదుపై దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సులో శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కోడేరు రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

కోడేరు రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *