Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోఆప్షన్ రేసులో షేక్ బాషా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోఆప్షన్ రేసులో షేక్ బాషా

వార్త ముఖ్యాంశాలు

  • --నిజాయితీకి, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం --టీడీపీ అంటే చెప్పలేనంత ప్రాణం ---కోఆప్షన్ సభ్యుని పదవికి సరైన సమర్ధుడు ఈ నెల 23వ తేదీ నెల్లూరు కార్పొరేషన్ మేయర్, అలాగే నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది.
  • ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ను కూడా ఎన్నుకుంటారు.
  • అలాగే కొంతమంది కోఆప్షన్ సభ్యులను కూడా కార్పొరేషన్ కౌన్సిల్‌కు నామినేట్ చేసే అవకాశం ఉంది.

–నిజాయితీకి, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం
–టీడీపీ అంటే చెప్పలేనంత ప్రాణం
—కోఆప్షన్ సభ్యుని పదవికి సరైన సమర్ధుడు

ఈ నెల 23వ తేదీ నెల్లూరు కార్పొరేషన్ మేయర్, అలాగే నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్‌ను కూడా ఎన్నుకుంటారు. అలాగే కొంతమంది కోఆప్షన్ సభ్యులను కూడా కార్పొరేషన్ కౌన్సిల్‌కు నామినేట్ చేసే అవకాశం ఉంది. ఈ కోఆప్షన్ సభ్యుల రేసులో నగర 19వ డివిజన్‌కు చెందిన షేక్ బాషా కూడా ఉన్నట్లు సమాచారం. ఆయన కోఆప్షన్ సభ్యుని పదవి కోసం తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలియవస్తుంది.

తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, పార్టీ అంటే ప్రాణమిచ్చే బాషా అభ్యర్థిత్వం పట్ల ఇప్పటికే కొంతమంది సీనియర్ టీడీపీ నాయకులు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీకి అంకితభావంతో క్షేత్రస్థాయిలో పనిచేసే బాషా పట్ల ప్రజల్లో మంచి సానుకూల స్పందన ఉంది. ముఖ్యంగా నెల్లూరు నగర తూర్పు ప్రాంతంలోని నూతన 19, 20 డివిజన్లలో బాషాకు ప్రజల్లో మంచి పేరు ఉంది. బాషా ప్రచారం చేశాడంటే ఆ ప్రాంతంలో ఆ అభ్యర్థికి మెజారిటీ ఓట్లు రావాల్సిందే.

2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాషా ఇప్పటి మంత్రి నారాయణ విజయం కోసం ఎంతగానో శ్రమించారు. అలాగే ఈ నెల 1న జరిగిన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో 19, 20 డివిజన్ల టీడీపీ అభ్యర్థులైన కర్తం ప్రతాప్ రెడ్డి, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్‌ల గెలుపు కోసం బాషా ఇంటింటికీ తిరిగి తనదైన శైలిలో ప్రచారం చేసి వారికి అనూహ్యమైన విజయాన్ని సాధించి పెట్టారు. పైన తెలిపిన రెండు డివిజన్లే కాక నగర పరిధిలో తనకు ఉన్న పరిచయాలతో, స్నేహ సంబంధాలతో బంధుమిత్రులను కలిసి టీడీపీ గెలుపు కోసం ఆయన చేసిన కృషి అపారం.

నూర్ బాషా సామాజిక వర్గానికి చెందిన బాషాకు నగరంలో గణనీయమైన ఓట్ల బ్యాంకు ఉంది. దీంతో ఆయన ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా టీడీపీ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగి, తనదైన శైలిలో కష్టించి పనిచేసి విజయాన్ని పార్టీకి తెచ్చిపెడతారు.

ముఖ్యంగా కోఆప్షన్ సభ్యులుగా ఉండాలంటే కార్పొరేషన్ చట్టాలు తెలిసి ఉండాలి. కార్పొరేషన్ విధానాలు, విధుల్లో అనుభవం ఉండాలి. ఏదో ఒక రంగంలో నిపుణులై ఉండాలి. నగర సామాజిక, భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. కార్పొరేటర్లతో ఎంతోకొంత అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ బాషాలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అందరిలో కలిసిపోతూ, అందరినీ తమతో కలుపుకుపోయే బాషా నగర ప్రజలందరికీ స్నేహశీలిగా సుపరిచితుడే. బాషాకు కోఆప్షన్ సభ్యుని పదవి ఇవ్వడం అంటే మంచితనానికి, పనితనానికి ఒక రూపం ఇచ్చినట్లేనని ఇప్పటికే నగర ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి నారాయణతో, అలాగే సిటీ నియోజకవర్గంలోని టీడీపీ సీనియర్ నేతలతో బాషాకు ఉన్న పరిచయాలు, స్నేహ సంబంధాలు ఆయన అభ్యర్థిత్వాన్ని మరింత ముందుకు నడిపేందుకు దారి చూపిస్తున్నాయి.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *