Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొమానపల్లి లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం అన్యాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.
ముమ్మిడివరం: పున్నమి ప్రతినిధి. ముమ్మిడివరం కొమానపల్లి గ్రామంలో ప్రజలకు విద్యుత్ సేవలు అందిస్తూ, కష్టపడి పనిచేస్తున్న లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం సరైన నిర్ణయం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ అన్నారు.

ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సేవలు అందించడంలో లైన్‌మెన్‌ల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి సిబ్బందిని ఆకస్మికంగా బదిలీ చేయడం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.

కొమానపల్లి గ్రామానికి కొత్త లైన్‌మెన్‌ను వెంటనే నియమించి, విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు.

కొమానపల్లి లైన్‌మెన్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం అన్యాయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *