Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొత్తపేటలో అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

కొత్తపేట బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బిజెపి వ్యవస్థాపక అధ్యక్షులు, భారతరత్న,మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఐఆర్ నియోజకవర్గ కన్వీనర్ పాలూరి సత్యానందం విచ్చేశారు ముందుగా పార్టీ కార్యకర్తలు నాయకులు వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ వాజపేయి 18 సంవత్సరాల వయసులో క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని 23 రోజులపాటు బ్రిటిష్ జైల్లో శిక్ష అనుభవించారని, భారతదేశానికి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకోసం అనేక పథకాలు అమలు చేసారని వాటిలో సర్వ శిక్ష అభియాన్,
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, అన్నపూర్ణ యోజన, స్వర్ణ చతుర్భుజి, జాతీయ రహదారుల అభివృద్ధి ఇలా ఎన్నో ప్రజలకు అవసరమైన పథకాలను తీసుకుని వచ్చిన మహనీయుడు స్మరించుకోవడం భారతీయులు అందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవస్వామి,బిజెపి యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు కోటిపల్లి దామోదర్,యువ మోర్చా జిల్లా కార్యదర్శి వలపశెట్టి కిరణ్ తేజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అన్యం సత్యనారాయణ, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి చోడపనీడి ముఖేష్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి వెన్నేటి రామకృష్ణ,
అభిమానులు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

కొత్తపేటలో అటల్ బీహార్ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *