వార్త ముఖ్యాంశాలు
- వరికుంటపాడు మండలం జి.కొండారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో రూ.35 లక్షల వి.బి.జి.
- రాంజీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
వరికుంటపాడు మండలం జి.కొండారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో రూ.35 లక్షల వి.బి.జి. రాంజీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తపల్లి సీసీ రోడ్లతో ప్రజల రాకపోకలకు సౌకర్యం కలుగుతుందని, వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.