Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

కొండా సురేఖకు బిగ్ షాక్! మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొండా సురేఖకు బిగ్ షాక్! మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

కొండా సురేఖకు బిగ్ షాక్!
మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

పున్నమి న్యూస్ 03
తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం.. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే ప్రక్రియకు గవర్నర్ ఆమోదం లభించింది. సీఎం రేవంత్‌రెడ్డి సిఫారసు లేఖపై గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తాజా సమాచారం. దీంతో కొండా సురేఖ మంత్రివర్గం నుంచి తొలగింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత వివాదానికి తెరపడినట్లైంది. పార్టీ క్రమశిక్షణ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫారసుల నేపథ్యంలో అధిష్ఠానం చర్యలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్‌కు సిఫారసు చేశారు.

సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైన వివాదం.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై అధిష్ఠానం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో సురేఖపై చర్యలకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
కాంగ్రెస్‌లో పెరిగిన రాజకీయ వేడి..
సురేఖ తదుపరి అడుగు ఏమిటి?
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఉత్కంఠ!

కొండా సురేఖకు బిగ్ షాక్! మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

కొండా సురేఖకు బిగ్ షాక్! మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *