Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

కేటీఆర్ గారి 50 వ పుట్టినరోజు సందర్భంగా “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న:మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ■ గౌరవ కేటీఆర్ గారి 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా సుమారు 500 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణతో పాటు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో…
  • నేర్చుకున్న విద్యతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా, మరికొందరికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు ◆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అమలు చేసి వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను బలోపేతం చేశారని తెలిపారు

For scrolling /publish

■ గౌరవ కేటీఆర్ గారి 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా సుమారు 500 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్, బ్యూటీషియన్ శిక్షణతో పాటు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు

◆ ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ, మహిళలు కుట్టు మిషన్, బ్యూటీషియన్ వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎవరి మీదా ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నేర్చుకున్న విద్యతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా, మరికొందరికి కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు

◆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అమలు చేసి వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను బలోపేతం చేశారని తెలిపారు

◆ కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, దళిత బంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు అండగా నిలిచారని గుర్తు చేశారు

◆ కేసీఆర్ పాలనలో మహిళలు అర్ధరాత్రి సమయంలో కూడా ధైర్యంగా బయటకు వెళ్లగలిగే భద్రతా వాతావరణం ఉండేదని, SHE Teams ఏర్పాటు చేసి మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. నేడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని, మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు

● చివరిగా మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, సమాజంలో ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆకాంక్షించారు

Plz cover…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *