Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కె.గంగవరం అముజూరులో వాజపేయి వర్ధంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కె.గంగవరం అముజూరులో వాజపేయి వర్ధంతి

వార్త ముఖ్యాంశాలు

  • ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కె.గంగవరం:* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం అముజూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయంసేవకులు, నిగర్వి, నిస్వార్థపరుడు, మాజీ భారత ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి మండల అధ్యక్షులు…
  • ముందుగా వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
  • ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.వి.

ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కె.గంగవరం:* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం అముజూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్రీయ స్వయంసేవకులు, నిగర్వి, నిస్వార్థపరుడు, మాజీ భారత ప్రధాని, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి మండల అధ్యక్షులు కొప్పిశెట్టి చంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.వి. రమణమూర్తి మాట్లాడుతూ అవినీతిరహిత పాలన అందించిన కాంగ్రెసేతర ప్రధాని అయిన వాజపేయి నాయకత్వంలో భారత్ అనేక రంగాలలో అభివృద్ధి చెందిందని అన్నారు. స్వర్ణ చతుర్భుజి ద్వారా జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయని, దీని వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు డ్రైవర్లకు సమయం ఆదా అయిందని తెలిపారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల విద్య అభివృద్ధి చెందిందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో బాలికల కోసం మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా, బేటీ బచావో బేటీ పడావో ద్వారా బాలికల విద్యాభివృద్ధి జరిగిందని చెప్పారు. ఒకసారి కాంగ్రెస్ బిజెపి గురించి అవహేళనగా మాట్లాడితే వాజపేయి తన కవితా ధోరణిలో సూర్యుడు ఉదయిస్తాడు, అంధకారం అంతరిస్తుంది, కమలం వికసిస్తుంది, దేశం కాషాయమయం కాబోతుంది, కాంగ్రెస్ ముక్త భారత్ అవతరిస్తుంది అంటూ కాంగ్రెస్ నాయకుల నోర్లు మూయించారని గుర్తు చేశారు. అలాగే కార్గిల్ యుద్ధం, ఫోక్రాన్ అణు పరీక్షల ద్వారా పొరుగు దేశాలకు భారత్ రక్షణ రంగంలో తీసిపోదనే సంకేతం పంపారన్నారు. ఈ కార్యక్రమంలో సలాది రామకృష్ణ, కౌలూరి వెంకటకృష్ణ, అవసరాల నారాయణమూర్తి, నున్న సత్యనారాయణ, గంగిశెట్టి సత్తిబాబు తదితరులు పాల్గొని వాజపేయికి నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *