వార్త ముఖ్యాంశాలు
- తమిళ సినీ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూశారు.
- ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గీతాల్లో 1997లో విడుదలైన ‘పోర్కాలం’ చిత్రంలోని పాట ముఖ్యమైనది.
- దేవా స్వరపరిచిన ‘తంజావూరు మన్నెత్తు తామిరభరణి తన్నీ విత్తు’ గీతాన్ని ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు.
తమిళ సినీ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూశారు. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గీతాల్లో 1997లో విడుదలైన ‘పోర్కాలం’ చిత్రంలోని పాట ముఖ్యమైనది. దేవా స్వరపరిచిన ‘తంజావూరు మన్నెత్తు తామిరభరణి తన్నీ విత్తు’ గీతాన్ని ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ పాటకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయకుడి పురస్కారం అందుకున్నారు.
సినిమా పరిధిని దాటి ఈ గీతం మరో సందర్భంలోనూ వినిపించింది. సింగపూర్ మాజీ అధ్యక్షుడు ఎస్.ఆర్. నాథన్ 2016లో మరణించినప్పుడు, ఆయనకు నివాళిగా ఇదే పాటను వినిపించారు.