Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

కుమారదేవం లో విజయ దుర్గఅమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కుమారదేవం లో విజయ దుర్గఅమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్22) తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో గ్రామంలో వాటర్ ట్యాంక్ వీధిలో విజయదుర్గ అమ్మవారి 14 వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా దేవి శరన్నవరాత్రి అమ్మవారి మండపంలో విజయదుర్గ అమ్మవారిని పురోహితులు వెలవెల పల్లి ప్రకాశరావు వేదమంత్రాలతో విగ్రహాన్ని ఈరి…

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు(సెప్టెంబర్22)

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో గ్రామంలో వాటర్ ట్యాంక్ వీధిలో విజయదుర్గ అమ్మవారి 14 వ వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా దేవి శరన్నవరాత్రి అమ్మవారి మండపంలో విజయదుర్గ అమ్మవారిని పురోహితులు వెలవెల పల్లి ప్రకాశరావు వేదమంత్రాలతో విగ్రహాన్ని ఈరి వీర్రాజు దంపతులు మరియూ వారి కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా ప్రతిష్టా కార్యక్రమం నిర్వహింపచేశారు,ముందుగా అమ్మవారిని విగ్రహ దాత ఇంటినుండి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి మండపంలో ప్రతిష్టించారు,ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా గ్రామంలోని మహిళా భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు,మా ప్రతినిధి అమ్మవారి మండప ప్రత్యేక తలు గురించి కమిటీ వారిని అడుగగా 14 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలచే చిన్నగా మొదలైన ఈ మహోత్సవాలు ఈరోజు అమ్మవారి దయవల్ల ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము ,ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది అది కమిటీ వారు అమ్మవారికి మొదటగా పెట్టిన చీరని భక్తులు వేలం పాటలో పోటీ పడి దక్కించుకుంటారు,కారణం ఏమిటి అంటే చీర పాడుకున్నవారికి వారు కోరుకున్న కోరికలు తీరుతాయి అని నమ్మకం లో పోటీ పడి పాడుకుంటారు అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *