Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

​కీ.శే. ఊడ్గుల సత్యనారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎఐసీసీ నేషనల్ కో-ఆర్డినేటర్ ప్రొ. కత్తి వెంకట్ స్వామి గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

​నర్సంపేట డివిజన్, చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సినిమా దర్శకుడు ఊడుగుల వేణు గౌడ్ పెద్దన్న, వరంగల్ జిల్లా గోపా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కీ.శే. ఊడ్గుల సత్యనారాయణ గౌడ్ ఇటీవల అకాల మరణం చెందడం పట్ల ఎఐసీసీ నేషనల్ కో-ఆర్డినేటర్, టీఎల్ఎఫ్ చైర్మన్ ప్రొ. కత్తి వెంకట్ స్వామి గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం రోజున సత్యనారాయణ గౌడ్ నివాసానికి చేరుకున్న ప్రొ. కత్తి వెంకట్ స్వామి గౌడ్, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. సత్యనారాయణ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ ఘోర విపత్తును తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
​ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి ‘మోకుదెబ్బ’ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, ఓబీసీ జిల్లా నాయకులు బండారి జనార్ధన్ గౌడ్, తాళ్లపెల్లి రామస్వామి గౌడ్, ఊడ్గుల చాణక్య గౌడ్, గౌతమ్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

​కీ.శే. ఊడ్గుల సత్యనారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎఐసీసీ నేషనల్ కో-ఆర్డినేటర్ ప్రొ. కత్తి వెంకట్ స్వామి గౌడ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *