Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

కిసాన్ గల్లీలో ఘనంగా గణేష్ మహారాజ్ హారతి కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కిసాన్ గల్లీలో ఘనంగా గణేష్ మహారాజ్ హారతి కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • కిసాన్ గల్లీలోని మహారాణా ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మహారాజ్‌కు ఘనంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రావుల రాము, డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, డాక్టర్ ముత్యం రెడ్డి, కిసాన్ గల్లి సర్పంచ్ దిపోల సాయినాథ్ పాల్గొని గణేష్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు.ఈ సందర్భంగా గణేష్ మహారాజ్ ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో,…
  • వినాయక చవితి పర్వదినం సందర్భంగా యువత భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

కిసాన్ గల్లీలోని మహారాణా ప్రతాప్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మహారాజ్‌కు ఘనంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రావుల రాము, డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్, డాక్టర్ ముత్యం రెడ్డి, కిసాన్ గల్లి సర్పంచ్ దిపోల సాయినాథ్ పాల్గొని గణేష్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు.ఈ సందర్భంగా గణేష్ మహారాజ్ ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా యువత భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. హారతి సమయంలో “జై బోలో గణేష్ మహారాజ్ కీ జై” అంటూ భక్తులు చేసిన నినాదాలతో కిసాన్ గల్లి ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో మహారాణా ప్రతాప్ యూత్ సభ్యులు, స్థానిక యువత, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.యువత ఐక్యత, భక్తిభావంతో నిర్వహించిన ఈ హారతి కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *