Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలిలో మహిళ దారుణ హత్య.. 20 సవర్ల బంగారంతో దుండగుడు పరారీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కావలిలో మహిళ దారుణ హత్య.. 20 సవర్ల బంగారంతో దుండగుడు పరారీ

వార్త ముఖ్యాంశాలు

  • కావలి: పట్టణంలోని తుఫాన్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వీరమ్మ (65) అలియాస్ విజయలక్ష్మిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
  • అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారైనట్లు పేర్కొన్నారు.

కావలి: పట్టణంలోని తుఫాన్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి వీరమ్మ (65) అలియాస్ విజయలక్ష్మిని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారైనట్లు పేర్కొన్నారు. సుమారు 20 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య, చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనతో తుఫాన్‌నగర్‌లో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *