Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

కార్మిక సమస్యల పరిష్కారానికి మార్చి 30న చలో హైదరాబాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్మిక సమస్యల పరిష్కారానికి మార్చి 30న చలో హైదరాబాద్

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ రంగాలలో పనిచేసే కార్మికుల సమావేశం నిర్వహించారు.
  • ఈ సమావేశంలో ఈ నెల మార్చి 30న హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.
  • ఈ కార్యక్రమం సిఐటియు, సిడబ్ల్యుఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించబడుతున్నట్లు తెలిపారు.

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి
సిరిసిల్ల జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో వివిధ రంగాలలో పనిచేసే కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల మార్చి 30న హైదరాబాద్‌లోని లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం సిఐటియు, సిడబ్ల్యుఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించబడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గీస బిక్షపతి మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా హెల్త్ సెంటర్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీఓ 12 ను సవరించాలని, లేబర్ కోడ్స్ సవరణ చేయాలని తదితర డిమాండ్లతో లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అన్ని మండలాల నుండి కార్మికులు, కర్షకులు, కార్మిక సోదరులు, సోదరీమణులు పెద్ద ఎత్తున తరలిరావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జంకినపల్లి యాదగిరి, ఎడ్ల రమేష్, మాధురి రమేష్, చిలకల రాజేందర్, లోకం సత్తయ్య, లోకం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *