Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అనపర్తి ఏరియా ఆసుపత్రి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అనపర్తి ఏరియా ఆసుపత్రి

అనపర్తి, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా ఆసుపత్రిలో అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో సౌకర్యాలు పెరగడంతో రోజువారీ ఓపీ 500 నుంచి 600 వరకు పెరిగిందని, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని పేర్కొన్నారు.

ఇటీవల రూ.1.25 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీస్‌ (ఐపీహెచ్‌ఎల్‌)ను ప్రారంభించారు. ఈ లేబొరేటరీ ద్వారా సుమారు 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మైక్రోబయాలజీ, హీమటాలజీ, క్లినికల్‌ బయోకెమిస్ట్రీ తదితర విభాగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అదేవిధంగా ఇటీవల ఆసుపత్రిలో బ్లడ్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో అత్యవసర సమయాల్లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఎక్స్‌రే పరీక్ష కూడా చేయించుకుని అక్కడ అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అనపర్తి ఏరియా ఆసుపత్రి

కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా అనపర్తి ఏరియా ఆసుపత్రి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *